బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నిర్వహిస్తున్న సుబ్బు డ్యాన్స్ స్టూడియోను మూసివేశారు. రెండు నెలలుగా శిక్షణకు వస్తున్న బాలికను, ఎవరూ లేని సమయంలో జ్ఞానేశ్వర్ వేధించినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీపెరుమాళ్ ఈ వివరాలను వెల్లడించారు.