కుటుంబ కలహాల కారణంగా వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్, కీర్తిక అగర్వాల్ దంపతులకు బియ్యారా అనే కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కీర్తిక ఏడాదిన్నర కిందటే తన తల్లిదండ్రుల వద్దకు కుమార్తెతో వెళ్లింది. ఈ నెల 2న హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం నెక్లెస్ రోడ్డు సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం పాప మృతదేహాన్ని గుర్తించారు.