సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కమలాదేవి మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా, ప్లాట్‌ఫాం నంబర్ 2 మధ్యలో పడి తీవ్రంగా గాయపడ్డారు. తన లగేజీని తీసుకోవడానికి తిరిగి రైలు ఎక్కినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజ్ వివరాలు వెల్లడించారు.