గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని టకులగడ్డ తండాకు చెందిన వాడిత్య మనీ బాయి అనే మహిళకు చెందిన ఇల్లు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో ఆమె మరో ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. తన ఇల్లు పాతది కావడంతో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చి, నివాసానికి వీలులేకపోయిందని, భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిందని మనీ బాయి తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వం సహాయం అందించాలని ఆమె కోరారు.