వికారాబాద్: మరో ఆర్టీసీ బస్సుకి ప్రమాదం

వికారాబాద్ జిల్లా తాండూర్ వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు, సిమెంట్ లారీని ఢీకొన్న ఘటనలో ఒక ప్రయాణికుడి తలకు గాయమైంది. డ్రైవర్, కండక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చేవెళ్ల ఘటన మరువకముందే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్