బోడుప్పల్ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలనీలో దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లిన ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు బీరువా తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ దొరకకపోవడంతో టీవీని దొంగిలించారు. ఆదివారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. పండుగ సమయాల్లో ఇళ్లలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.