నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడు ఉప్పల్ కళ్యాణ్ పూరికి చెందిన మురళీకృష్ణ అని గుర్తించారు. మురళీకృష్ణ కూలి పనులు చేస్తుండగా, ఆయన భార్య అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.