పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను సమూహంగా చేర్చి సాంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు సంబరాలు జరిపారు. పల్లె వాతావరణంలో సద్దుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ ముగింపు సందర్భంగా సద్దులు వండి, అమ్మవారికి నైవేద్యం అర్పించి, తరువాత మహిళలు పరస్పరం పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు.