99 రోజుల కార్యాచరణ ప్రగతి ప్రణాళికలో భాగంగా, బుధవారం కాప్రా సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. హైటెన్షన్ రోడ్‌లో విద్యుత్ స్తంభాలకు అనధికారికంగా అతికించిన ప్లకార్డులు, ప్రకటన బోర్డులను వెంటనే తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు. రోడ్ కారిడార్‌లోని శానిటేషన్ పరిస్థితులను కూడా సమీక్షించారు.