వరద నీటి ప్రవాహానికి శాశ్వత పరిష్కారం: ఉప్పల్ ఎమ్మెల్యే

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో 60 లక్షల రూపాయల నిధులతో వరద నీటి ప్రవాహం కొరకు శాశ్వత పరిష్కారం దిశగా బాక్స్ డ్రైన్ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, కాప్రా సర్కిల్ డిఈ రూపా, ఏఈ శ్రవంతి, స్థానిక కాలనీ వాసులు పరమేష్ రెడ్డి, మధు, రమేష్, ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి, సోమయ్య, సారంగపని మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్