నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కూలీ దారుణ హత్య మిస్టరీ వీడింది. జులాయి యువకులే.. కసాయిలు దారుణ హత్యకు ఒడిగట్టారు. మృతుడు మురళి కృష్ణ కారు లిఫ్టు అడిగిన పాపానికి.. 4 గంటలు నరకయాతన చూపించారు. మానవత్వం లేని.. మానవ మృగాలు.. అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. నాచారం సీఐ ధనుంజయ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారానికి రాఘవేంద్ర నగర్ చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్ (18) 9వ తరగతి అర్ధాంతరంగా మానివేశాడు. ఎలాంటి పని పాట లేకుండా జులాయిగా తిరిగేవాడు.ఇతనితో పాటు మరో ముగ్గురిని రిమాండ్ కు తరలించారు.