హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన వికలాంగుల క్రీడోత్సవాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, హైదరాబాద్‌లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. వికలాంగులు అన్ని రంగాల్లో రాణిస్తారని, ఈ క్రీడా పోటీలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.