వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ ఆడుతున్న మహిళలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. హబ్సీగూడ కాకతీయ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు, యువతులు బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తున్నారు. ఇది మన సంస్కృతి, మన బ్రాండ్ అంటూ 'జై తెలంగాణ' నినాదాలు చేస్తూ తమ ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు. బతుకమ్మ అంటే తమకు ఒక ఎమోషన్ అని మహిళలు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్