వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలు, వదినను కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.