TG: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు హైడ్రా భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు.. తమ ప్రాంతానికి వచ్చి మీరు లేనోళ్లు గుడిసెలు ఏసుకోండి అని చెప్పాడని.. ఇప్పుడు సీఎం అవ్వగానే కూల్చేశాడని తెలిపారు. పండుగ రోజు ఇండ్లలో నుండి బయటకు గుంజుకొచ్చి.. తమ ఇళ్లు కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమని CM రేవంత్ మోసం చేశాడని ఆరోపించారు.