హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గవాయ్ స్పందించారు. 'నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో తప్పుగా చూపించారు' అని ఆయన అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి' అని ఆయన వ్యాఖ్యానించారు.