రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి రూ.241 కోట్లు సంపాదించా: ప్రశాంత్ కిశోర్

రాజకీయ ఎన్నికల వ్యూహకర్త.. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ బిహార్ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్ సురాజ్ పార్టీకి వచ్చిన నిధులపై ఆయన తాజాగా స్పందించారు. రాజకీయ పార్టీలకు 2 గంటల పాటు సలహాలు ఇచ్చి తాను రూ.11 కోట్ల కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నానని వెల్లడించారు. ఇలా తాను మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించానని అన్నారు. అందులోనుంచి జీఎస్టీ, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టానని చెప్పారు.

సంబంధిత పోస్ట్