జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారిపోయా: అమిత్ షా

దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని మోదీ పిలుపును కేంద్ర మంత్రులు స్వీకరించారు. డిజిటల్ ఇండియా కింద జోహో (Zoho) ప్లాట్‌ఫామ్ వైపు మంత్రులు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈమెయిల్‌ను జోహో మెయిల్‌కు మార్చినట్లు ప్రకటించారు. ఇకపై amitshah.bjp@zohomail.in ఉంటుదని అమిత్ షా ట్వీట్ చేశారు. అదే విధంగా, అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా జోహో సేవలను వినియోగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్