TG: హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని హీరో సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన 'ట్రాఫిక్ సమ్మిట్ 2025'కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. 'తాగి బండి నడిపేవాళ్లకి, హెల్మెట్ ధరించని వాళ్లకి చిన్న పనిష్‌మెంట్ ఇస్తే వారికి జీవితాలపై మరింత బాధ్యత పెరుగుతుంది. వారి కుటుంబాలు రోడ్డున పడవు' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు.