TG: బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి కవిత అరెస్టే కారణమని కాంగ్రెస్ MLA కడియం శ్రీహరి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు జైలుకెళ్లడం సరైన పద్ధతి కాదని తనకు అనిపించిందని ఆయన చెప్పారు. అందుకే తాను ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రూ.వేల కోట్లు కొల్లగొట్టిందని కడియం ఆరోపించారు. వాటాలు పంచుకునే క్రమంలో కుటుంబంలో వారి మధ్య గొడవలు తలెత్తాయన్నారు.