ఏడు నెలల్లో 7 యుద్ధాలు ఆపాను: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో మంగళవారం ప్రసంగిస్తూ.. తన పాలనలో అమెరికా కొత్త శకంలో అడుగుపెట్టిందని ప్రకటించారు. ఏడాది క్రితం అమెరికా తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగం.. ఏ దేశమూ మాకు సమానంగా లేదు’’ అని వ్యాఖ్యానించారు. కేవలం ఏడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను తాను ఆపినట్లు పేర్కొన్నారు. వాటిలో భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత కూడా ఒకటని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్