ICICI బ్యాంకు తమ కస్టమర్ల కోసం అక్టోబర్ 4 నుంచి కీలక మార్పులను అమలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇకపై డిపాజిట్ చేసిన చెక్కులు అదే రోజున క్లియర్ అవుతాయి. ఈ మార్పుతో వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, కస్టమర్లు బ్రాంచ్ కట్ ఆఫ్ సమయానికి ముందే చెక్కులను డిపాజిట్ చేయాలి. మోసపూరిత లావాదేవీలను నివారించడానికి 'పాజిటివ్ పే' ఫీచర్‌ను ఉపయోగించాలని, రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు ఇది తప్పనిసరి అని బ్యాంకు సూచించింది.