ధనుష్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఇడ్లీ కొట్టు గ్రామీణ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రి వారసత్వమైన ఇడ్లీ కొట్టు వ్యాపారాన్ని ఆధునిక పంథాలో నడపాలనుకునే కుమారుడు (ధనుష్)–తండ్రి (రాజ్‌కిరణ్) మధ్య విభేదాలే కథకి ప్రధానాంశం. ప్రథమార్థంలో భావోద్వేగాలు బలంగా ఆకట్టుకున్నా, ద్వితీయార్థంలో పట్టు తప్పింది. ధనుష్ నటన సహజంగా మెప్పించగా, మిగిలిన వారి పాత్రలు మూవీకి బలాన్నిచ్చాయి. సంగీతం, విజువల్స్ హైలైట్. పాతదనపు కథనం ఉన్నా, కుటుంబ భావోద్వేగాలతో కట్టిపడేసే డ్రామాగా నిలిచింది. మొత్తాని ఈ మూవీకి ప్రేక్షకులు ఇస్తున్న రేటింగ్: 3/5