కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. దీని ప్రకారం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చని, వారి ఆస్తులను వినియోగించుకునే హక్కు పిల్లలకు ఉండదని స్పష్టం చేసింది.