ఫోన్ లోన్ చెల్లించకపోతే.. రిమోట్ లాక్?

ఫోన్లు లోన్‌పై కొనుగోలు చేసి సకాలంలో చెల్లించకపోతే ఆ ఫోన్ లాక్ అయ్యేలా ఆర్బీఐ కొత్త రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఫోన్లను రిమోట్‌ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్‌ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారని సమచారం.

సంబంధిత పోస్ట్