డార్జిలింగ్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కోతికి ఆహారం తినిపిస్తే పర్యటకుడైనా, సామాన్యుడైనా రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. శైల్షహర్ అంతటా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర చీఫ్ ఫారెస్టర్ భాస్కర్ మాట్లాడుతూ ‘కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అడవుల్లో ఆహారం సేకరించే అలవాటును మారుస్తోంది. వాటికి ఆహారం లభించకపోతే దాడి చేస్తాయి. అందుకే డార్జిలింగ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు.