బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో రుణాల పంపిణీ, రికవరీలో బ్యాంకులకు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత ఏడాది గడువులోగా తిరిగి చెల్లించకపోవడంతో 30 శాతానికిపైగా ఎగవేతదారుల జాబితా(NCA)లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్స్‌పై బ్యాంకులు కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. బంగారం రుణాలపై నెలనెలా వడ్డీని వసూలు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. నెలనెలా వడ్డీ కట్టకపోతే ఖాతాదారు సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడి క్రెడిట్ వ్యాల్యూ పడిపోతుందని హెచ్చరిస్తున్నాయి.