ఇక్కడ అన్నదానం చేయాలంటే.. మూడేళ్లు వేచి చూడాలి

TG: నిర్మల్‌ (D) లోకేశ్వరం (M)లోని అబ్దుల్లాపూర్‌ వినాయక చవితి ఉత్సవాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2500 జనాభా గల గ్రామంలో గణేశ్ ఉత్సవాల 11 రోజులూ ఏ ఇంట్లోనూ పొయ్యి వెలిగించరు. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకూ అంతా గణపతి ప్రసాదమే. ప్రస్తుతం అన్నదానానికి రోజుకు రూ.లక్ష వెచ్చిస్తున్నారు. ఇలా 11 రోజులు అన్నదానానికి.. వచ్చే మూడేళ్ల వరకూ బుకింగ్‌లు పూర్తవడం విశేషం. వినాయకుడిని ఊరేగించి.. గోదావరి నీళ్లు చల్లి తిరిగి భద్రపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్