భారతదేశ సంస్కృతిలో గురువులకు దేవునితో సమానమైన స్థానం ఉంది. ఉపాధ్యాయులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా.. జీవన కళ, నైతికత, క్రమశిక్షణను విద్యార్థులకు నేర్పుతారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందువల్ల సమాజంలో విద్యార్థులను మంచి పౌరులుగా మార్చడానికి కృషి చేసే ఉపాధ్యాయులను స్మరించుకోవడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.