వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైతులు ప్రధాన భూమిక వహిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా పప్పుధాన్యాల సాగు పెంచాలని సూచించారు. పంటల వ్యయం తగ్గించి, రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.5 కోట్ల సబ్సిడీ ఇస్తే, తమ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ అందించిందన్నారు. వెనకబడిన జిల్లాలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మోదీ వెల్లడించారు.