IND vs PAK: భారత్ బ్యాటర్లను కవ్వించిన పాక్ బౌలర్లు (వీడియో)

IND vs PAK నిన్నటి మ్యాచులో భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ తొలి నుంచే విరుచుకుపడ్డారు. దీంతో పాక్ ఆటగాళ్లు సహనం కోల్పోయారు. మధ్యమధ్యలో మనవాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. తొలుత గిల్, అఫ్రీది మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ తర్వాత తన బౌలింగ్‌లో గిల్ ఫోర్ కొట్టగానే రౌఫ్ మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్‌‌ను ఏదో అన్నాడు. దీంతో అభిషేక్ ఏమాత్రం తగ్గలేదు. అతడిపైకి దూసుకెళ్లాడు. గొడవ పెద్దది కాకుండా అంపైర్ వచ్చి రౌఫ్‌ను పక్కకు పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్