మహిళల ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ప్రతికా(37), హర్లీన్(48), దీప్తి(53), అమన్‌జోత్(57) రాణించడంతో టీమిండియా 269 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లు కూడా విజృంభించడంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో 47 ఓవర్లకు 211 పరుగులు చేసింది. దీప్తి 3, శ్రీచరణి 2, రాణా 2, క్రాంతి, అమన్‌జోత్, ప్రతికా తలో వికెట్ పడగొట్టారు.