భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు కీలకమైన చర్చలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. అమెరికా అసిస్టెంట్ ట్రేడ్ ప్రతినిధి బ్రెండన్ లించ్, భారత ప్రతినిధులతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై సమావేశం కానున్నారు. ఇటీవల అమెరికా భారత్‌పై 50% సుంకం విధించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ట్రంప్, మోదీ పరస్పర సానుకూల వ్యాఖ్యలతో చర్చలు ఊపందుకున్నాయి. మరి భారత్-అమెరికా మధ్య డీల్ కుదురుతుందో లేదో వేచి చూడాల్సిందే.