జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో నియంత్రణ రేఖ(LOC) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. “ఉదయం 5:30గంటలకు, బాలాకోట్ జనరల్ ఏరియాలోని వైట్ నైట్ కార్ప్స్ దళాలు LOC సమీపంలో అనుమానాస్పద కదలికను గుర్తించాయి. చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు అప్రమత్తమైన దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాము” అని అధికారులు తెలిపారు.