భారత సైన్యానికి చెందిన ‘విద్యుత్ రక్షక్’కు కేంద్రం 20 ఏళ్లపాటు పేటెంట్ హక్కు మంజూరు చేసింది. మేజర్ రాజ్‌ప్రసాద్ అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ బహుళ జనరేటర్లు, పవర్ సిస్టమ్‌ల పర్యవేక్షణ, రక్షణ, నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. తక్కువ బరువుతో ఉన్న ఈ యంత్రం ఎత్తైన, దూర ప్రాంతాల్లో సైన్యానికి ఉపయోగకరమని ఏడీజీపీఐ పేర్కొంది.