దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 57 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లకే ఆ జట్టు ఆలౌటైంది. అలీషన్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్దీవ్ యాదవ్ 4, శివమ్ దూబె 3, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. కాగా భారత్ టార్గెట్ 58 పరుగులు పరుగులు.