భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలో రైతుగా మారారు. అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంలో (ISS) మెంతి, పెసర విత్తనాలను మొలకెత్తించి, వాటి వృద్ధిపై ప్రయోగం చేస్తున్నారు. జీరో గ్రావిటీలో మొలకల పెరుగుదల, పోషక విలువలు, జన్యుపరమైన మార్పులను విశ్లేషిస్తున్నారు. దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల్లో తాజా ఆహారాన్ని సమకూర్చేందుకు ఇది సహాయపడుతుంది. ఈ ప్రయోగం స్పేస్ ఫార్మింగ్‌కు భారత్ నుంచి మార్గదర్శకంగా నిలవనుంది.