భారత రెజ్లర్ బజరంగ్ పూనియా తండ్రి కన్నుమూత

భారత రెజ్లర్ బజరంగ్ పూనియా తండ్రి బల్వాన్ పూనియా కన్నుమూశారు. స్వతహా మల్లయోధుడు అయిన బల్వాన్ పూనియా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ, గత 18 రోజులుగా ఢిల్లీలో గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. తండ్రి బల్వాన్ స్ఫూర్తితో బజరంగ్ చిన్నవయసులోనే రెజ్లింగ్‌ మీద ఆసక్తి పెంచుకున్నాడు. కుమారుడి ఇష్టాన్ని గ్రహించిన ఆయన తానే తొలి కోచ్‌గా మారి శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్