ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాంజిన్ బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు భారతీయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహ్వానించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అంటూ దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు.