ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. కొచ్చిలో ల్యాండింగ్‌

అబుదాబి బయల్దేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగో 6E 1403 విమానం శనివారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన  కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్‌ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతితో విమానాన్ని తిరిగి మళ్లించి, కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఘటనపై తనిఖీలు జరుపుతున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్