చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పాక్ సరిహద్దు నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సమయంలో వీరిని కాల్చి చంపారు. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో, ఆర్మీ దళాలు ఆపరేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్