బీసీ మంత్రికి అవమానం.. టెంట్ ఎత్తుకెళ్లిన పోలీసులు

TG: బీసీ మంత్రికి ఘోర అవమానం జరిగింది. హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీల హక్కుల కోసం జేఏసీ నిర్వహించిన ధర్మదీక్షలో బీసీ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అయితే స్థానిక పోలీసులు ఈ దీక్షకు అనుమతి లేదంటూ టెంట్ సామగ్రిని తొలగించి వాహనాల్లో తీసుకెళ్లారు. మంత్రి శ్రీహరి ఫోన్ చేసి అడిగినా స్థానిక ఏసీపీ అనుమతి ఇవ్వలేదు. ఈ పోలీసుల వైఖరికి మంత్రి, విప్ ఘోర అవమానానికి గురై, ఎండలోనే దీక్ష కొనసాగించారు.

సంబంధిత పోస్ట్