ఐపీఎల్ 2025 ఫైనల్ కొత్త రికార్డును సృష్టించింది. పంజాబ్‌పై బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టీవీ, డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో కలిపి మొత్తం మ్యాచ్‌లకు 840 బిలియన్ల నిమిషాల వ్యూస్ వచ్చాయని జియో హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు మొత్తంగా 31.7 బిలియన్ల వీక్షణలు వచ్చినట్లు సమాచారం. ఫైనల్‌ను టీవీలో 169 మిలియన్ల మంది, డిజిటల్‌లో 892 మిలియన్ మంది వీక్షించి కొత్త బెంచ్‌మార్క్‌ను నమోదు చేశారు.