రైల్వే స్టేషన్‌లో ఘోరంగా కొట్టుకున్న IRCTC సిబ్బంది (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. IRCTC సిబ్బంది ఒక చిన్న విషయంలో ఏర్పడిన గొడవ కారణంగా పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో, సిబ్బంది ఒకరిపై ఒకరు డస్ట్‌బిన్, బెల్ట్‌లతో కొట్టుకోవడంతో పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వందేభారత్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు ఈ గొడవ జరిగింది. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది.

సంబంధిత పోస్ట్