ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహ్యూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తామని వెల్లడించారు. దాడులకు అమెరికా అనుమతి అవసరం లేదని, వారు అనుమతి వచ్చే వరకు ఎదురుచూడమని పేర్కొన్నారు. శత్రువును నేల కూల్చడమే తమ లక్ష్యమని, దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలను ఐడీఎఫ్ చేపడుతుందని వ్యాఖ్యానించారు.