పంజాబ్ మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (SCL) రూపొందించిన దేశీయ 32-బిట్ మైక్రోప్రాసెసర్ “విక్రం3201”ను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌కు అందజేశారు. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో అభివృద్ధి చేసిన ఈ చిప్ అంతరిక్ష వినియోగాలకు అనుకూలంగా రూపుదిద్దుకుంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది.