అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50% సుంకాలు విధించడం పట్ల అమెరికా అగ్ర ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత తెలివి తక్కువ చర్యగా ఖండించారు. ఈ నిర్ణయం విధ్వంసకర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఆసియాలో భారత్ అత్యంత కీలక భాగస్వామి అయినప్పటికీ వాషింగ్టన్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని సాచ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల కారణంగా మంచి విశ్వాసాన్ని కోల్పోయినట్లైందని చెప్పారు.