TG: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడిసెల్లో బ్రతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలకు మంచి చేసే విధంగా రాజకీయం ఉండాలని, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.అలాగే
ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా, కేవలం 4 వేల జనాభాతో ఉండేదని గుర్తు చేశారు.