ప‌ల్లీల‌ను పచ్చిగా కన్నా మొల‌కెత్తించి తింటేనే మంచిదట!

పల్లీలు మనం తరచూ తింటూనే ఉంటాం. కానీ నిపుణుల సూచన ప్రకారం, వీటిని పచ్చిగా తినడం కంటే నీటిలో నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందట. మొలకెత్తిన పల్లీల్లో విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వయస్సు ప్రభావాలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేసి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. షుగర్, ఒబేసిటీ నియంత్రణకు కూడా ఇవి ఉపకరిస్తాయి.

సంబంధిత పోస్ట్