రాష్ట్ర అభివృద్ధికి జగన్‌ వ్యతిరేకి: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనుడని వ్యాఖ్యానించారు. డాక్టర్‌ కావాలనుకునే పేద విద్యార్థుల కలలకు జగన్‌ అడ్డుగా నిలుస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్‌ కోటాకు 50 శాతం సీట్లు కేటాయించింది జగన్‌ ప్రభుత్వమేనని ఆరోపించారు. మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు జగన్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్